VIDEO: ఘనంగా క్రిస్టియన్ల పస్కా పండుగ
SRD: కంగ్టి మండలం చాప్ట కే గ్రామంలో క్రిస్టియన్ సోదరులు భక్తిశ్రద్ధలతో ఫామ్ సండే, పస్కా పండుగ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రార్థన మందిరం నుంచి ఈత మట్టలు చేతపట్టి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మ్యూజిక్ సౌండ్ మధ్య మహిళలు ఆనందోత్సవాలతో నృత్యాలు చేశారు. ఈరోజు ప్రత్యేక విశిష్టతపై పాస్టర్లు వివరించి హిత బోధ చేశారు.