చర్లపల్లిలో ఘనంగా బొడ్రాయి తృతీయ వార్షికోత్సవం

చర్లపల్లిలో ఘనంగా బొడ్రాయి తృతీయ వార్షికోత్సవం

NLG: జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు చర్లపల్లిలో ఆదివారం బొడ్రాయి తృతీయ వార్షికోత్సవం పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు దరువుల మధ్య వెల్లి బొడ్రాయికి పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. అనంతరం మేకపోతులు కోసి తమ పిల్లా పాపలను చల్లంగా చూడమని మొక్కుకున్నారు. దీనితో స్థానికంగా పండుగ వాతావరణం సంతరించుకుంది.