జిల్లా వైద్యాధికారిగా వసంత రావు

జిల్లా వైద్యాధికారిగా వసంత రావు

SRD: జిల్లా వైద్యాధికారిగా డాక్టర్ వసంతరావును నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ క్రిస్టియాన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆర్ఎంవోగా పనిచేస్తున్న వసంతరావు పదోన్నతిపై సంగారెడ్డి జిల్లాకు రానున్నారు. ఇంఛార్జి జిల్లా వైద్యాధికారిగా ఉన్న డాక్టర్ నగర్ నిర్మల డిప్యూటీ వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరిస్తారు.