కోళ్ల షెడ్డు కూలి.. వృద్ధురాలు మృతి

VSP: కాపులుప్పాడ మండలం సోమన్నపాలెంలో విషాదకర సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఇంటి పక్కన కోళ్ల పెంపకం కోసం నిర్మించిన షెడ్డు కూలిపోవడంతో 75 ఏళ్ల పాల సింహాచలం అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.