భారీ వర్షానికి కూలిన BSNL టవర్
VKB: కుల్కచర్ల మండల కేంద్రంలో గాలి దుమారంతో కూడిన వర్షానికి BSNL టవర్ కూలిపోయింది. రాత్రి సమయం కావడంతో ప్రాణనష్టం జరగలేదు. భారీ వర్షానికి నేల కూలిన BSNL టవర్‌తో సిగ్నల్ రాకపోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి సిగ్నల్ పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.