ఆర్థిక ప్రణాళికల్లో తెలంగాణ ప్రజలు టాప్

ఆర్థిక ప్రణాళికల్లో తెలంగాణ ప్రజలు టాప్

దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడంలో తెలంగాణ ప్రజలు ముందుంటున్నారని ఇన్సూరెన్స్ ఎవేర్‌నెస్ కమిటీ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 94 శాతం మంది ప్రజలు అనూహ్య పరిస్థితులకు ముందుగానే ప్రణాళికలు వేసుకోవడం అలవాటు చేసుకుంటున్నారని తెలిపింది. 38 శాతం మంది వచ్చే 3 నెలల్లో జీవిత బీమా కొనాలని భావిస్తున్నారట. 84 శాతం మంది దీర్ఘకాలిక పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంది.