కువైట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3లక్షల స్వాహా

NLR: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసిన ఘటన అనంతసాగరంలో జరిగింది. బాధితుని వివరాల ప్రకారం..పొంతల తులసీధర్ అనే వ్యక్తి కువైట్‌లో ఉద్యోగం అని చేప్పి రూ. 3 లక్షలు తీసుకుని కువైట్‌లో హకామా ఇప్పించకుండా ఓ రూములో బంధించాడని అవేదన వ్యక్తం చేశాడు. కువైట్ పోలీసులు తనను అరెస్ట్ చేసి 5 రోజులు జైలులో పెట్టి తర్వాత తిరిగి దేశానికి పంపించారని తెలిపాడు.