డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి

కృష్ణా: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఘంటసాలపాలెం పంచాయతీ కార్యదర్శి బోలెం అర్జునరావు అన్నారు. సోమవారం ఘంటసాలపాలెం సచివాలయంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ దోనె రజని, ఎంపీటీసీ సభ్యురాలు కొల్లూరి విజయ, టీడీపీ నాయకులు వేమూరి సాయి వెంకటరమణ, సచివాలయ ఉద్యోగులు, ప్రజలచే పంచాయతీ కార్యదర్శిలు పాల్గొన్నారు.