'పోలీసులు సమన్వయంతో పనిచేయాలి'
SRPT: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 31 వేడుకల బందోబస్తులో పటిష్టంగా విధులు నిర్వర్తించిన సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసులంతా సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.