కోవిడ్ డాక్టర్ల కుటుంబాలకు సుప్రీం గుడ్ న్యూస్

కోవిడ్ డాక్టర్ల కుటుంబాలకు సుప్రీం గుడ్ న్యూస్

కోవిడ్ సమయంలో సేవలు అందిస్తూ చనిపోయిన వైద్యుల కుటుంబాలకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. వారు 'పీఎంజీకేవై(PMGKY)' బీమాకు అర్హులేనని, బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ప్రైవేట్ డాక్టర్లకు ఇది వర్తించదన్న బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా ప్రాణాలర్పించిన వైద్యులకు న్యాయం చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.