ఆత్మహత్యకు యత్నం.. రక్షించిన పోలీసులు
MDK: తూప్రాన్ పెద్ద చెరువు వద్ద ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన లింగరాణి, ఆమె కూతురును పోలీసులు రక్షించి కుటుంబీకులకు అప్పగించారు. రాణి భర్త శివశంకర్ తాగుడుకు బానిసై చావమంటూ వేధింపులు చేసినట్లు తెలిపారు. ఈరోజు సైతం తిట్టడంతో కూతురుతో కలిసి రాణి పెద్ద చెరువు వద్దకు వెళ్ళింది. 100 డయల్ కాల్ రావడంతో పోలీసులు వెళ్లి ఇరువురిని రక్షించారు.