VIDEO: అధ్వానంగా మారిన రోడ్లు

BHPL: కాటారం మండలంలోని కాటారం-ఆదివారంపేట రోడ్డు చెరువును తలపిస్తోందని శుక్రవారం వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు ద్వారా మండల కేంద్రంలోని పలు గ్రామాల ప్రజలు కాటారానికి రాకపోకలు సాగిస్తారని స్థానికులు తెలిపారు. ఈ సమస్య పై అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని స్థానికులు కోరారు.