వరంగల్ మార్కెట్లో పత్తి, మిర్చి ధరలు ఇలా..!
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ 2 రోజుల విరామం అనంతరం సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ. 8,000 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ. 20,000 ధర పలకగా.. వండర్ హాట్ (WH) మిర్చి రూ. 30,500పలికింది. తేజ మిర్చి ధర రూ. 20 వేలు పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.