యునెస్కోలో అంబేద్కర్ విగ్రహం.. మోదీ హర్షం

యునెస్కోలో అంబేద్కర్ విగ్రహం.. మోదీ హర్షం

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పారిస్ యునెస్కో ప్రధాన కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. యునెస్కో డైరెక్టర్ జనరల్ ఖలీద్ ఎననీ సమక్షంలో ఈ విగ్రహాన్ని భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి విశాల్ ప్రారంభించారు. విగ్రహం ఆవిష్కరణపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వకారణమన్నారు.