VIDEO: RTC బస్ ఢీ కొట్టిందని గొడవ.. ట్రాఫిక్‌కు అంతరాయం
MNCL: RTC బస్ తన XLను ఢీ కొట్టిందని వాహనదారుడు గొడవ చేయడంతో బెల్లంపల్లి పాత సింగరేణి స్టోర్ వద్ద గురువారం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రోడ్డు వెడల్పు పనులు జరుగుతుండటంతో ఒకే వైపు రాకపోకలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రెండు బస్సులు ఎదురెదురుగా రాగా ముందు ఉన్న XLను బస్సు వెనుక నుంచి చిన్నగా తాకింది. దీంతో అతడు డ్రైవర్‌తో ఘర్షణకు దిగాడు.