రేపు జిల్లాలో పర్యటించనున్న కవిత

రేపు జిల్లాలో పర్యటించనున్న కవిత

HNK: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈనెల 8, 9 తేదీల్లో వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నట్లు జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ తెలిపారు. ఉనికి చర్ల ఎక్స్ రోడ్ వద్ద జిల్లా జాగృతి శ్రేణులు బైక్ ర్యాలీతో కవితకు స్వాగతం పలుకుతారన్నారు. కాజీపేట మండలం టేకులగూడెం గ్రామంలో వరి పంటలను పరిశీలించి, సమ్మయ్య నగర్ వరద ముంపు బాధితులను పరామర్శించనున్నట్లు ఆయన వెల్లడించారు.