మెంటాడలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన సీఐ

VZM: కొండలింగాలవలస పంచాయతీ మధుర గిరిజన గ్రామమైన రెడ్డివానివలసలో సారా, మడ్డికల్లు తయారీ స్థావరాలపై ఆదివారం వేకువజామున పోలీసులు మూకుమ్మడి దాడి చేశారు. గజపతినగరం సీఐ రమణ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మడ్డికల్లు తయారీకి సిద్ధంగా ఉంచిన వెయ్యి లీటర్లు ముడిసరుకు, 30 లీటర్లు సారా స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.