'ఈనెల 6 నుంచి పత్తి కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి'
ఆసిఫాబాద్: జిల్లాలో ఈనెల 6 నుంచి పత్తి కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. అధికారులు, జిన్నింగ్ మిల్లు యజమానులతో పత్తి కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది 9.80లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, రూ. 38 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో 24 జిన్నింగ్ మిల్లుల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలన్నారు.