మృతుడి కుటుంబానికి 50 కేజీల బియ్యం విరాళం
SRPT: నడిగూడెం మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన కల్లేపల్లి రాములు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబానికి అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు వేల్పుల సోమయ్య కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం ఇవాళ విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.