నీట మునిగిన పంటలను పరిశీలించిన ఏవో

KMR: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సోయాబీన్ పంట నీట మునిగింది. శనివారం రోజున చిన్న ఎక్లారా, అంతాపూర్, దన్నుర్ గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి రాజు సోయాబీన్ నీట మునిగినా పంటలను పరిశీలించారు. వర్షం తగ్గాకా మరల పంటలను పరిశీలించి, ఎంత మేర నష్టం వాటిల్లిందనే నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు.