నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
BDK: గుండాల, ఆళ్లపల్లి మండలాల పరిధిలో 33కేవీ విద్యుత్ ఫీడర్‌లో మరమ్మతుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ 2 మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని, కావున ఈ ప్రాంత విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.