ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ
KMR: మద్నూర్ మండలం కోడిచిరా గ్రామంలో ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.