ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: MPDO
NZB: కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో బుధవారం ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. విడతల వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇళ్ల నిర్మాణానికి విడతల వారీగా డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన పేదలకు ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుందన్నారు.