ఉచిత కంప్యూటర్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
KKD: ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 10వ తరగతి నుండి డిగ్రీ చదివి, 40 ఏళ్ల లోపు యువతీ యువకులు ఈ కోర్సుకు అర్హులు. మరిన్ని వివరాలకు సంప్రదించాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి మురళి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు.