కాంగ్రెస్ నాయకుడిపై మండిపాటు.. మాలధారుల ఆందోళన
WGL: హనుమాన్ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన కాంగ్రెస్ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హనుమాన్ మాలధారులు నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. చెప్పులు, షూలతో వాకింగ్ చేయవద్దని చెప్పగా నాయకుడు దుర్భాషలాడాడని మాలధారులు మండిపడ్డారు. వారు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.