వినాయక చవితి వేడుకల్లో సబ్ కలెక్టర్ పూజలు

వినాయక చవితి వేడుకల్లో సబ్ కలెక్టర్ పూజలు

SRD: నారాయణఖేడ్ రెవెన్యూ సబ్ డివిజన్ కార్యాలయంలో నేడు వినాయక చవితి పండుగను జరుపుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి పాల్గొని పూజలు చేశారు. పురోహితులు గురురాజు శర్మ వినాయక చవితి విశిష్టతపై వివరించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.