పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
VZM: డెంకాడ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ నెల్లిమర్ల లోకం నాగ మాధవి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా బొడ్డవలస గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ ఆరోగ్య కేంద్రం భవనాన్ని ఆమె ప్రారంభించారు. అలాగే పోతయ్యపాలెం గ్రామంలో బీటీ రోడ్డు ప్రారంభోత్సవం నిర్వహించారు. అనంతరం దొడ్డిబడువ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు.