పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం

NTR: జి.కొండూరు మండలం కవులూరులో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌తో కలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఒక్కో రైతుకు రూ.7 వేలు తొలి విడతగా అందజేస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో రూ.15.12 కోట్లు రైతుల ఖాతాలో జమ, దాదాపు 30,241 మంది రైతులకు లబ్ది కలుగుతుందని తెలిపారు.