జిల్లాలో ఇద్దరు బాలికలు అదృశ్యం
BDK: మణుగూరు పట్టణంలోని శివలింగాపురం బాల సదనం నుండి శనివారం ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. వివరాలు ప్రకారం.. భద్రాచలంకు చెందిన ఇద్దరు బాలికలు బాల్య వివాహాలు చేసుకోవడంతో వారిని మణుగూరు శివలింగాపురం బాలల సదనంలో చేర్చారు. అయితే వారిద్దరూ శనివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తున్నామని చెప్పి బాలికల సదనం గోడ దూకి వెళ్లిపోయారు. వారి ఆచూకి సంబంధించి సమాచారం తెలియాల్సి ఉంది.