VIDEO: నీటి నాణ్యతను పరీక్షించిన కమిషనర్
కృష్ణా: గుడివాడ 11వ వార్డు పరిధిలోని ఎస్సీ కాలనీ, వలివర్తిపాడు రోడ్డులో మున్సిపల్ కమిషనర్ మనోహర్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా నీటి సరఫరా వ్యవస్థను పరిశీలించిన ఆయన, క్లోరినేషన్ స్థాయిని స్వయంగా పరీక్షించారు. పైప్‌లైన్లలో ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయేమో తక్షణమే గుర్తించి, మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.