'సీఎం చేతకానితనం వల్లే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం'
HYD: కృష్ణా జలాలను అక్రమంగా తరలించిన ఏపీ ఇప్పుడు గోదావరి నీళ్లపై కన్నేసిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేతకానితనం వల్లే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. CWC మీటింగ్‌లో ఏపీ అధికారుల మాటలకు మనవాళ్లు తల ఊపడం దారుణమని విమర్శించారు. గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు.