VIDEO: రెండో రోజుకు చేరిన అంగన్వాడీ వర్కర్స్ నిరసన దీక్ష
GNTR: ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయం సమీపంలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీలు మంగళవారం రెండో రోజు నిరసన దీక్ష నిర్వహించారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, బడ్జెట్‌లో ఐసీడీఎస్‌కు కేటాయింపులు పెంచాలని, మే నెల మొత్తం సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు.