VIDEO: చేగుంటలో కోతుల హల్ చల్

VIDEO: చేగుంటలో కోతుల హల్ చల్

MDK: చేగుంటలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. పట్టణంలోని ఏ వీధిలో చూసినా కోతులు హల్చల్ చేస్తున్నాయి. ప్రజల వెంట పడుతూ.. భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులపై దాడి చేసి గాయపరుస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.