జీవీఎంసీ ఉచిత ఈ-ఆటోలు.. బీచ్ రోడ్డుపై ప్రయాణానికి సౌకర్యం
VSP: విశాఖ బీచ్ రోడ్డులో పర్యాటకులు, స్థానికుల రవాణా కష్టాలను తగ్గించేందుకు జీవీఎంసీ ఉచిత ఎలక్ట్రిక్ ఆటో సేవలను ప్రారంభించింది. కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహిస్తూ, వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు, చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. కోస్టల్ బ్యాటరీ నుంచి సాగర్ నగర్ వరకు నడుస్తున్న బ్లూ అండ్ వైట్ ఈ-ఆటోలు రద్దీని తగ్గించన్నాయి.