'ప్రతి 15 రోజులకు తాగునీటిని పరీక్షించాలి'
AKP: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే తాగునీటిని ప్రతి 15 రోజులకు ఒకసారి పరీక్షించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మంచినీటి ట్యాంకులను పరిశుభ్రం చేయడంతో పాటు క్లోరినేషన్ చేయాలన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన జరగకుండా చూడాలని తెలిపారు.