29న మెగా జాబ్ మేళా

29న మెగా జాబ్ మేళా

W.G: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకమాన్ తెలిపారు. స్థానిక యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పనలో భాగంగా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ మేళాలో నిరుద్యోగులు పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.