యూరియా మాఫియా గుట్టురట్టు

TG: నాగర్‌కర్నూల్ జిల్లాలో యూరియా మాఫియా గుట్టురట్టు అయింది. పెద్దకొత్తపల్లిలో రోడ్డుపైనే బ్లాక్‌లో డబుల్ రేటుకు యూరియా బస్తాలు అమ్మకాలు చేస్తుండగా రైతులు ఆందోళనకు దిగారు. అధిక ధరకు యూరియా అమ్మడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని స్టాక్‌ను సీజ్ చేశారు.