ఉదయగిరి తహశీల్దార్ సూచనలు

NLR: ఉదయగిరి తహసీల్దార్ ఆఫీస్‌లో ఈ నెల 6న ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ రామ్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీవో పావని, ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ హాజరవుతారన్నారు. అన్ని శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారన్నారు. ఈ సదావకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.