VIDEO: నర్సీపట్నంలో పారిశుద్ధ్య కార్మికుడు ఆవేదన

VIDEO: నర్సీపట్నంలో పారిశుద్ధ్య కార్మికుడు ఆవేదన

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో శానిటరీ విభాగం పారిశుద్ధ్య కార్మికులు అష్ట కష్టాలు పడుతున్నారు. చెత్తను తరలించే పుష్ కార్ట్ వాహనం చక్రం ఊడి మూడు నెలలుగా ఇబ్బందులు పడుతున్నామని రమణ అనే పారిశుధ్య కార్మికుడు వాపోయాడు. వాహనం మార్చమని మూడు నెలలుగా సానిటరీ ఇన్ స్పెక్టర్ చిట్టిబాబును అడిగినప్పటికీ కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.