ఆలేరులో పోలీసుల ముందస్తు అరెస్టులు

ఆలేరులో పోలీసుల ముందస్తు అరెస్టులు

BHNG: ఆలేరులో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు కొలుపుల హరినాధ్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ముదిరాజ్ సమస్యలపై ఛలో గాంధీభవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఈ ముందస్తు అరెస్టు జరిగింది. ఈ సందర్భంగా కొలుపుల హరినాధ్ మాట్లాడుతూ.. అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని పేర్కొన్నారు.