మిత్రునికి సహాయం చేసిన తోటి మిత్రులు

NRML: అనారోగ్యంతో బాధపడుతున్నమిత్రునికి టెన్త్ క్లాసు తోటి మిత్రులు ఆర్థిక సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. జన్నారం మండలంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన శాఖపురం రవీందర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం సాయంత్రం ఆయనకు నాటి టెన్త్ క్లాస్ మిత్రులు రూ.18 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో తోటిమిత్రులు నాగభూషణం, రమేష్, జలపతి, రఘు తదితరులు పాల్గొన్నారు.