దేవనకొండలో మురుగు నీటి సమస్య
KRNL: దేవనకొండ వీధిలో మురుగు నీరు నిలిచిపోవడంతో పందుల స్వైర విహారం, దోమల బెడద పెరిగిందని కాలనీవాసులు వాపోతున్నారు. పంచాయతీ అధికారులు తాత్కాలిక పనులు చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల చిన్నపిల్లలు, వృద్ధులు రోగాల బారిన పడే అవకాశం ఉందని, తక్షణమే శాశ్వత చర్యలు చేపట్టాలని వారు ఇవాళ డిమాండ్ చేస్తున్నారు.