మేడారంలో తల్లుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
MLG: మేడారం మహా జాతరకు వచ్చే బాలింతల సౌకర్యార్థం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాలిచ్చే తల్లుల కేంద్రాలను ఏర్పాటు చేశారు. జాతర మొత్తం 15 చోట్ల ఈ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి కేంద్రంలో తాగునీరు, ఫ్యాన్ల సదుపాయం కల్పించారు. భక్తులు క్యూలైన్లలో చిన్నపిల్లలను తీసుకెళ్లకపోవడం మంచిదని DWO ప్రేమలత సూచించారు.