ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో
NZB: సాలూర క్యాంపు చెరువు వద్ద జరుగుతున్న EGS, ఉపాధి హామీ పనులను ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. అనంతరం పలు సూచనలు చేశారు. పని స్థలంలో కార్మికుల కోసం తాగునీరు, ప్రథమ చికిత్స సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని గమనించి, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.