తెనాలిలో వ్యక్తి మృతదేహం లభ్యం

తెనాలిలో వ్యక్తి మృతదేహం లభ్యం

GNTR: తెనాలిలోని నాజరుపేట, బిక్షవతి బజారులో శనివారం సుమారు 50 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ కోటేశ్వరమ్మ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వద్ద ఎటువంటి వివరాలు లభ్యం కాకపోవడంతో,హెల్పింగ్ సోల్జర్స్ బృందం సహాయంతో మృతదేహాన్ని వైద్యశాల మార్చురీకి తరలించారు.