రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
SKLM: పోలాకి మండలం పిన్నింటి పేట సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఈఈ నరసింహ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గుప్పిడి పేట, చిన కొవిరిపేట, బద్దం, పిన్నింటి పేట, కోడూరు, గుల్లవానిపేట గ్రామాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. దీనికి వినియోగదారులు సహకరించాలన్నారు.