మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో వేమిరెడ్డి దంపతుల భేటీ

మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో వేమిరెడ్డి దంపతుల భేటీ

NLR: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో ఆయనను కలిసిన వేమిరెడ్డి దంపతులు రాజ్‌నాథ్ సింగ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. మంత్రికి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు అందజేశారు.