మొవ్వలో CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కృష్ణా: పామర్రు MLA వర్ల కుమార్ రాజా ఈ రోజు మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేశారు. చీలి నాగమణికు రూ.43,251, కోట సూర్య ప్రకాష్ రావుకు రూ. 81,000, గూడపాటి పవన్ కుమార్‌కు రూ. 27,684 CMRF చెక్కును అందజేశారు. ఆయనతో పాటు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావు, తదితరులు ఉన్నారు.