ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: కూటమి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెనుగొండ పేరును 'వాసవీ పెనుగొండ'గా మార్చాలని నిర్ణయించింది. ఆర్యవైశ్యుల చిరకాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆర్యవైశ్య సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.