ఎల్బీనగర్ TO హయత్‌నగర్.. కేంద్రానికి DPR
HYDలో ఎల్బీనగర్, హయత్‌నగర్ మధ్య మెట్రో విస్తరణ అడుగుల్లో వేగం పుంజుకున్నాయి. 7.1 కి.మీ. మార్గానికి అనుమతి కోరుతూ HMRL కేంద్రానికి డీపీఆర్ సమర్పించింది. ఇదే సమయంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా 5.5 కి.మీ. డబుల్ డెకర్ నిర్మాణానికి రోడ్లు, భవనాల శాఖ ఆమోదం కోరింది. ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే తూర్పు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది.